తెలంగాణ (Telangana) సామాజిక ఆర్థిక ముఖచిత్రం – 2023 ప్రచురణను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) ఆవిష్కరించారు. మంత్రుల నివాస ప్రాంగణం(Minister’s Quarters)లో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రచురణను వినోద్ కుమార్ రిలీజ్ చేశారు .ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. వివిధ రంగాల మేధావులు, సామాజికవేత్తలు, ప్రజలు, పోటీ పరీక్షలకు సిద్దం అయ్యే విద్యార్థులకు ఈ ప్రచురణ ఎంతో ఉపయోగకరం అని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. రూ. 350 వరకు వ్యయం అయిన ఈ ప్రచురణను విద్యార్థులకు సబ్సిడీపై కేవలం రూ. 150 కే అందించనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 12,000 వేల కాపీలను అధికారులు ముద్రించారని, ఒక్కొక్క ప్రచురణ 311 పేజీలతో కూడి ఉందని వెల్లడించారు. ఆన్లైన్లో www.tsdps.telangana.giv.in అనే వెబ్సైట్లో ప్రతి ఒక్కరికీ ఆదివారం నుంచి అందుబాటులో ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలలో ఉండే చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (Chief Planning Officer) కార్యాలయాల్లో ఈ ప్రచురణల ఫిజికల్ కాపీలు అందుబాటులో ఉంటాయని వినోద్ కుమార్ అన్నారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎకనామిక్స్ స్టాటిస్టికల్ శాఖ డైరెక్టర్ జీ. దయానంద్, టీఎస్డీపీఎస్ కార్యనిర్వాహక అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.