కోనసీమ: తూర్పు గోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గం విలీనం కావాలన్న ప్రజల చిరకాల వాంఛ నెరవేరేందుకు ఇక ఒక్క అడుగు దూరమే మిగిలి ఉంది. మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరిలో విలీనం చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటికే చేయాల్సిన తతంగమంతా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఇప్పటికే పూర్తి చేశారు.