తన రిటైర్మెంట్ వార్తలపై కెప్టెన్ సూర్యకుమార్ స్పందించాడు. టీ20 ప్రపంచకప్ గెలిచాక ప్రధాన కోచ్ గంభీర్‌తో కలిసి సూర్య మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్మెంట్ గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సూర్య సమాధానం చెబుతూ.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని, రిటైర్మెంట్ గురించి తనకు ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశాడు. దీంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.