»In Maharashtra Brs Party Is The First Candidate To Win The Gram Panchayat Elections
BRS Party : మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టిన బీఆర్ఎస్
జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కేసీఆర్ ఆశలకు తొలి అడుగుపడ్డట్లే కనిపిస్తోంది. మహారాష్ట్రలో BRS పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టింది. రాష్ట్రంలో మొదటి అభ్యర్థి విజయం సాధించారు. జాతీయ రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS) తొలి విజయం సాధించింది. ఛత్రపతి సంభాజీనగర్ లో గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి.
BRS Party : జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలన్న కేసీఆర్(KCR) ఆశలకు తొలి అడుగుపడ్డట్లే కనిపిస్తోంది. మహారాష్ట్రలో BRS పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టింది. రాష్ట్రంలో మొదటి అభ్యర్థి విజయం సాధించారు. జాతీయ రాజకీయాల్లోకి(National politics) కొత్తగా అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS) తొలి విజయం సాధించింది. ఛత్రపతి సంభాజీనగర్(Chhatrapati Sambhaji Nagar) లో గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి. గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఉప ఎన్నికలో BRS అభ్యర్థి విజయం ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి గఫార్ సర్దార్ పఠాన్ గెలుపొందారు. ఏప్రిల్ నెలలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది.
బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అందుకనుగుణంగా మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో పార్టీ నేతలతో సమావేశాలు కూడా నిర్వహించారు. రాష్ట్రంలో వచ్చే అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. గురువారం (మే 18) జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడ్డాయి. దీంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి గఫర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన తొలి విజయం ఇదే కావడం విశేషం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యదర్శులకు రెండు రోజుల రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిర్ నాందేడ్‌లో ఏర్పాటు చేయబడింది. నాందేడ్ నగరంలోని అనంత లాన్స్‌లో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజుల శిబిరం మే 19, 20 వరకు జరుగుతుంది. దీనికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది.