AP: వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరికీ సెల్ఫోన్లు ఉన్నాయని కానీ సరిగా వాడటం లేదన్నారు. 24 గంటలు సెల్ఫోన్లో లేనిపోనివన్నీ చూస్తున్నారని చెప్పారు. సెల్ ఫోన్ ద్వారా సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. సద్వినియోగం చేసుకుంటే సెల్ఫోన్ బ్రహ్మాండమైన అస్త్రం అని వెల్లడించారు.