»Rcb Vs Srh 65th Match Today Will Hyderabad Break Bangalore
IPL 2023: నేడు RCB Vs SRH..బెంగళూరుకు హైదరాబాద్ బ్రేక్ వేస్తుందా?
IPL 2023.. 65వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నేడు(మే 18న) హైదరాబాద్(hyderabad)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో లేనప్పటికీ హైదరాబాద్(SRH) టీం గెలవాలని చూస్తుండగా..మరోవైపు బెంగళూరు జట్టు ఈ రేసులో ఉండాలంటే రెండు మ్యాచులు తప్పక గెలవాలి.
IPL 2023లో నేడు(మే 18న) గురువారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో 65వ మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. SRH ఇప్పటివరకు 12 గేమ్‌లలో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక RCB 12 మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు SRH ఇప్పటికే ప్లేఆఫ్‌ల రేసు నుంచి నిష్క్రమించింది. కానీ RCB ప్లేఆఫ్‌లకు చేరుకోవడానికి తప్పనిసరిగా రెండు మ్యాచ్‌లను గెలవాలి.
ఈ నేపథ్యంలో ఈరోజు జరగనున్న మ్యాచ్ బెంగళూరు టీం గెలుస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంకోవైపు సన్ రైజర్స్ కూడా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్ గెలవాలని చూస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసులో లెనప్పటికీ ఢిల్లీ టీం నిన్న పంజాబ్ జట్టును ఓడించి..ఆ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను మరింత కఠినం చేసింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పట్ల క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌తో సహా SRH వారి మునుపటి రెండు గేమ్‌లను కోల్పోయింది. RCB తమ మునుపటి గేమ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను 112 పరుగుల భారీ తేడాతో ఓడించిన తర్వాత ఈ గేమ్‌లోకి వస్తోంది.
IPL చరిత్రలో RCB, SRH 22 సార్లు తలపడ్డాయి. ఆ క్రమంలో RCB తొమ్మిది మ్యాచ్‌లలో విజేతగా నిలిచింది. అయితే SRH 12 గేమ్‌లలో విజయాన్ని సాధించింది. దీంతోపాటు RCBతో ఇటీవల జరిగిన గత ఐదు మ్యాచ్‌లలో SRH మూడింటిలో విజయం సాధించింది. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఎవరో గెలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.