»Even If Delhi Is Not In The Race But Won The Match It Will Be Difficult For Punjab To Play Off
IPL 2023: రేసులో లేకున్నా ఢిల్లీ గెలుపు..పంజాబ్ ప్లే ఆఫ్ కు కష్టాలు
ఐపీఎల్ 2023లో బుధవారం (మే 17న) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన 64వ మ్యాచులో పంజాబ్ కింగ్స్(PBKS)పై ఢిల్లీ క్యాపిటల్స్(DC) 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ధర్మశాలలో బుధవారం జరిగిన IPL 2023.. 64వ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్(DC) 15 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు పంజాబ్ ఆటగాడు లివింగ్‌స్టోన్ 48 బంతుల్లో 94 రన్స్ చేసినప్పటికీ సాధ్యపడలేదు. ఆ క్రమంలో పీబీకెఎస్(PBKS) 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి పోరాడి ఓడిపోయింది. లివింగ్‌స్టోన్‌తో పాటు, మరో ఆటగాడు అథర్వ టైడే అర్ధ సెంచరీ 55(42) రన్స్ చేశాడు. ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్ట్జే చెరో రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ తలో ఒకరిని ఔట్ చేసి పంజాబ్ ఆటగాళ్ల పరుగులను కట్టడి చేశారు.
ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. రోసౌవ్ 37 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పృథ్వీ షా 54(38 బంతుల్లో), కెప్టెన్ డేవిడ్ వార్నర్ 46 పరుగులు చేసి మంచి భాగస్వామ్యం అందించారు. ఇక పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రాన్ ఒక్కడు మాత్రమే ఇద్దరిని ఔట్ చేసి బెస్ట్ అని పించుకున్నాడు. కానీ మ్యాచ్ మాత్రం గెలవలేక పోయారు. ఈ మ్యాచ్ ఓటమి PBKS ప్లే ఆఫ్ ఆశకు పెద్ద దెబ్బగా మారింది. మరోవైపు ఈ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరింది.
ప్లేఆఫ్ రేసులో లేని ఢిల్లీ మ్యాచ్ గెలవడంతో IPL 2023 ప్లేఆఫ్‌లకు చేరుకునే PBKS అవకాశాలకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జట్టు ప్రస్తుతం 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. దీంతోపాటు ఆ అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.
RCB తమ చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే పురోగమిస్తుంది. వారు ప్రస్తుతం MI కంటే మెరుగైన నెట్ రన్ రేట్‌ను కలిగి ఉన్నారు. ఇది వారికి సహాయపడుతుంది. వారు చివరి రెండు మ్యాచ్‌లలో ఒకదానిలో ఓడిపోతే, CSK, LSG చివరి నాలుగుకు అర్హత సాధిస్తాయి. ఆ క్రమంలో MI, KKR, RR, PBKS తమ చివరి మ్యాచ్‌లో ఎలా రాణిస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుంది.