Novak Djokovic : టెన్నిస్‌లో నొవాక్ జకోవిచ్ ఒక సంచలనం. చిన్నతనంలోనే కోర్టులో అడుగుపెట్టి దిగ్గజాలైన రోజర్ ఫెదరర్(Roger Federer), రఫెల్ నాదల్(Rafael Nadal)కు కొరకరాని కొయ్యగా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు వాళ్లను పెద్ద టోర్నమెంట్లలో ఓడించి చాంపియన్‌గా అవతరించాడు. అనతికాలంలోనే టెన్నిస్‌పై తన ముద్ర వేశాడు. 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచాడు. ఇది ఇలా ఉండగా రోమ్ మాస్టర్స్‌లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించాడు. ఒకే మాస్టర్స్ 1000 ఈవెంట్లలో 17 సార్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
2007 నుంచి ఈ టర్నీలో జకోవిచ్ పాల్గొంటున్నాడు. ఆడిన ప్రతిసారి కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరి రికార్డుల్లోకెక్కాడు. ఈ టోర్నీ ప్రారంభ రౌండ్లలో ఇప్పటివరకు జకోవిచ్ కు ఓటమి లేదు. తాజా ప్రదర్శనతో దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ రికార్డును (16 సార్లు) బద్దలు కొట్టాడు. రోమ్ మాస్టర్స్‌లో ప్రస్తుతం జకోవిచ్ గెలుపోటముల రికార్డు 67-10గా ఉంది. 2007 నుంచి జకో ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు ముందు ఓడింది లేదు. జకోవిచ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సహచర ఆటగాళ్లు రోజర్ ఫెదరర్, రఫెల్ నదాల్లతో ఏనాడు ఫ్రెండ్ షిప్ చేయలేదని చెప్పాడు. ప్రత్యర్థుల మధ్య స్నేహం ఎప్పటికీ కుదరదని చెప్పిన జకో.. తాను ఫెదరర్, నదాల్‌లను ఎప్పుడూ గౌరవిస్తానని అన్నాడు. తాను ఫెదరర్, నదాల్‌లను చూస్తూ పెరిగానని, ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే వారి వల్లేనని చెప్పుకొచ్చాడు.