»Meteorological Department About Southwest Monsoon
Southwest Monsoon: జూన్ 4న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Summer) తీవ్రంగా ఉన్నాయి. చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు(temparature) 45 డిగ్రీలకు పైన నమోదవుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత కూడా వేడి ఆవిర్లు వస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
Southwest Monsoon: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Summer) తీవ్రంగా ఉన్నాయి. చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు(temparature) 45 డిగ్రీలకు పైన నమోదవుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత కూడా వేడి ఆవిర్లు వస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈనెల 18వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం(IMD) తెలిపింది. మోచా తుఫాన్(Mocha Cyclone) ప్రభావం వల్ల ఎండ పెరిగిందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
మండేఎండల్లో మాడి పోతున్న జనానికి మరికొన్ని ఎక్కువ రోజులు సెగలు, పొగలు తప్పదు. ఎప్పటిలా కాకుండా.. ఈ సారి మరో 4 రోజులు ఆలస్యంగానే నైరుతి రుతుపవనాలు వచ్చే ఛాన్స్ ఉందంటోంది వాతావరణ శాఖ. అంటే.. ఈ ఎండల వేడిని ఎంత లేదన్నా మరో వారం రోజులు ఎక్కువగానే భరించక తప్పదంటున్నారు అధికారులు. నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం ఆలస్యంగా జూన్ 4న వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అప్పటి వరకు ఎండలు మండుతాయని వెల్లడించింది. హీట్‌వేవ్ రాబోయే 7 రోజులు పెద్దగా లేకపోయినా.. ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతాయన్నారు. హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాజస్థాన్‌లలో దుమ్ముతో కూడిన గాలులు వీస్తున్నాయని, ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గతవారం కంటే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) జూన్ 4వ తేదీ నాటికి అవి కేరళ (Kerala) తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 4న ప్రవేశించే అవకాశం ఉందని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది మే 29 నాటికే అవి కేరళ తీరానికి చేరుకున్నాయి. 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న ప్రవేశించాయి.