సీఎంను ఓ సామాన్యుడు కలవాలంటే అది కష్టమైన పనే. సీఎం వద్దకు వెళ్లాలంటే ఎన్నో భద్రతా వలయాలు దాటుకువెళ్లాలి. సామాన్యులకు అది అసాధ్యం. ఏ ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీ, మంత్రిగాని రికమెండ్ చేస్తేగాని సాధ్యపడదు. అలాంటిది మధ్య ప్రదేశ్ కు చెందిన ముఖేష్ పటేల్ తన బిడ్డను రక్షించుకోవడానికి సీఎం శివరాజ్ సింగ్ చోహాన్ ను కలవాలనుకున్నాడు. తన బిడ్డకు గుండెలో రంద్రం ఉందని అందుకు ఇప్పటివరకు రూ.3 లక్షలను ఖర్చు చేసానని తెలిపాడు. మరో రూ.4 లక్షలు ఉంటేగాని వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాగైన సీఎంను కలవాలనుకున్నాడు. అంతలో… ఎంపీలోని కుష్వాహాలో జాట్ కమ్యునిటీతో సీఎం సమావేశం ఉందని తెలుసుకున్నాడు.
ముఖేష్ పటేల్ తన భార్యా, బిడ్డతో కలిసి సమావేశానికి హాజరయ్యాడు. సీఎం ప్రసంగిస్తుండగా… తన ఏడాది బాబును సీఎం సభా వేధికపై విసిరేశాడు. అప్రమత్తమైన సిబ్బంది బాబును తల్లికి అందజేశారు. సీఎం బాబు గురించి ఆరా తీయగా… సమస్యను వివరించారు. దీంతో వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు సీఎం.