సెర్బియా టెన్నిస్ లెజెండ్ నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) మరో ఘనత సాధించాడు. యూఎస్ ఓపెన్ 2023 టైటిల్‌ను సొంతం చేసుకుని రికార్డ్ నెలకొల్పాడు. రష్యా క్రీడాకారుడు మెద్వెదెవ్‌ను జకోవిచ్ చిత్తుగా ఓడించి 24వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. దీంతో టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన మార్గరెట్ కోర్టు(24) రికార్డును సమం చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు.
2021 నాటి యుఎస్ ఓపెన్ (US Open 2021)లో మెద్వెదెవ్ చేతిలో జకోవిచ్ పరాజయం పాలయ్యాడు. అయితే ఈసారి మాత్రం టోర్నమెంట్లో జకోవిచ్ దూకుడుతనం వ్యవహరించాడు. తొలి సెట్లో 6-3 తేడాతో మెద్వెదెవ్‌ను జకోవిచ్ చిత్తుగా కట్టడి చేయడం విశేషం. రెండో సెట్లో కూడా మెద్వెదెవ్ పై జకోవిచ్ గట్టి పోటీ ఇవ్వడంతో ఒకానొక దశలో స్కోరు 6-6కు చేరింది.
ఉత్కంఠ దశలో జకోవిచ్ (Novak Djokovic) తన అద్భుత ఆటతీరుతో కనబర్చారు. 7-6తో సెట్ తన ఖాతాలోకి జకోవిచ్ మార్చుకున్నాడు. ఆ తర్వాతి సెట్లోనూ జకోవిచ్ దూకుడుగా ఆడుతూ వచ్చాడు. దీంతో 6-3తో విజయం సాధించాడు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ జకోవిచ్ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ గెలుపొందడం విశేషం. ఇకపోతే ఆయన వింబుల్డన్‌లో మాత్రం యువ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ చేతిలో ఓటమిచెందాడు.