అమెరికా టీనేజి అమ్మాయి కోకోగాఫ్ (Kokogoff) యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ కోకో గాఫ్ 2-6, 6-3, 6-2తో తన కంటే మెరుగైన సీడెడ్ ప్లేయర్ అరియానా(Ariana) సబలెంకాపై విజయం సాధించింది. న్యూయార్క్ (New York) లోని ఆర్ధర్ ఆష్ స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన ఈ టైటిల్ సమరంలో కోకో గాఫ్ తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ.. అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు సెట్లు చేజిక్కించుకుని విజేతగా నిలిచింది.
ఫ్లోరిడా(Florida)కు చెందిన 19 ఏళ్ల కోకో గాఫ్ కు కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. మొదటి గ్రాండ్ స్లామ్ ను సొంతగడ్డపై గెలవడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో కోకో గాఫ్, సబలెంకా అనేక అనవసర తప్పిదాలకు పాల్పడిప్పటికీ, చివరికి అమెరికా అమ్మాయిదే పైచేయి అయింది. క్వార్టర్ ఫైనల్లో కోకో గాఫ్ 67 నిమిషాల్లో 6–0, 6–2తో 20వ సీడ్ ఒస్టాపెంకో(Seed Ostapenko)(లాత్వియా)పై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్,