»Carlos Alcaraz Defeated Djokovic To Win The Wimbledon Title 2023
Wimbledon 2023: జొకోవిచ్‌ను మట్టి కరిపించిన కార్లోస్ అల్కరాజ్
24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, 8వ వింబుల్డన్ టైటిల్ కోసం ఆడిన నొవాక్ జకోవిచ్(Novak Djokovic)కు నిన్న షాక్ ఎదురైంది. 20 ఏళ్ల స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) జకోవిచ్‌ను మట్టికరిపించి తొలి వింబుల్డన్ టైటిల్ గెల్చుకున్నాడు.
వింబుల్డన్ 2023(Wimbledon 2023)లో 36 ఏళ్ల నోవాక్ జొకోవిచ్(Novak Djokovic) 34 మ్యాచ్‌ల విజయ పరంపరకు 20 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) ఆడ్డుకట్ట వేశాడు. ఆదివారం ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్ మ్యాచులో తన మొదటి వింబుల్డన్ ఛాంపియన్షిప్ టైటిల్, రెండో గ్రాండ్ స్లామ్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్లో తొలి వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత నిలబడి టెన్నిస్‌లో తదుపరి రాజు తానే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
1-6, 7-6, 6-1, 3-6, 6-4తో సుదీర్ఘ ఐదు సెట్ల పోరు తర్వాత జొకోవిచ్ కార్లోస్ చేతిలో ఓటమి పాలయ్యాడు. జకోవిచ్ మొదటి సెట్‌ను 6-1తో సులభంగా గెలుచుకున్నప్పుడు, కార్లోస్ ఏమీ లేకుండా తిరిగి రావలసి వచ్చినట్లు అనిపించింది. అయితే కార్లోస్ రెండవ సెట్(set)లో తిరిగి పోరాడడం ప్రారంభించాడు. సుదీర్ఘమైన రెండో సెట్‌ను టైబ్రేకర్‌కు 8-6తో కార్లోస్ గెలుచుకున్నాడు. దీంతో ఆట బిగుసుకుపోయి, పూర్తి నిశ్శబ్ధం మారింది. ఏదైనా జరగొచ్చని 20 ఏళ్ల యువకుడు ఊపిరి పీల్చుకుని ఆటను చివరివరకు పోటీతో పూర్తి చేశాడు.
రెండో సెట్లో షాక్‌కు గురైన జకోవిచ్ 6-1తో మూడో సెట్‌ను సులువుగా కైవసం చేసుకున్న కార్లోస్ మళ్లీ నిరూపించాడు. నాలుగో సెట్‌ను 6-3తో చేజిక్కించుకున్న జొకోవిచ్ ప్రేక్షకులకు, ప్రత్యర్థులకు మ్యాచ్‌కు టెన్షన్‌ని అందించాడు. ఇక కీలకమైన ఐదో సెట్లో వయసు, చురుకుదనం కార్లోస్‌కు అనుకూలంగా పనిచేశాయి. ఆరంభంలో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన కార్లోస్ 6-4తో సెట్‌ను కైవసం చేసుకుని వింబుల్డన్‌లో కొత్త చరిత్రను లిఖించాడు. 2008లో ఐదు సెట్ల మ్యాచ్(fifth set match)లో రోజర్ ఫెదరర్‌ను ఓడించిన రాఫెల్ నాదల్ తొలి వింబుల్డన్ టైటిల్‌కు కార్లోస్-జకోవిచ్ పోరాటం నాంది అని టెన్నిస్ ప్రేమికులు అంటున్నారు.