Teachers will be transferred from tomorrow: Minister Botsa Satyanarayana
Botsa Satyanarayana:ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టీచర్స్ బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేపటి నుంచి (గురువారం) టీచర్స్ బదిలీ ప్రక్రియ ప్రారంభం అవనుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తెలిపారు. బదిలీలు పూర్తి అయిన తర్వాతే పదోన్నతుల ప్రక్రియ చేపడుతామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు.
పదోన్నతులు, బదిలీల గురించి చర్చించామని మంత్రి బొత్స (Botsa)తెలిపారు. నిబంధనలకు అనుగునంగా బదిలీలు చేపడుతామని వివరించారు. 675 ఎంఈవో-2 పోస్టులకు సంబంధించి జీవో జారీచేస్తామని పేర్కొన్నారు.
350 గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులు, 9269 మంది ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తామని మంత్రి బొత్స (Botsa) తెలిపారు. 1746 మంది పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియను రేపటి నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టంచేశారు. కోర్టులకు వెళ్లి ప్రక్రియను అడ్డుకోవద్దని ఉద్యోగ సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు.