BHPL: చారిత్రక సంపదగా ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఆదివారం చిట్యాల పోలీస్ స్టేషన్ రెండవ ఎస్సై హేమలత స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు నాగరాజు పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు, తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం పరిరక్షణ కమిటీ తరుపున ఘనంగా సత్కరించారు.