సేంద్రియ పాల ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప (Akshayakalpa) హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. సేంద్రియ పాలు మాత్రమే విక్రయించిన సంస్థ.. ఇప్పుడు కూరగాయలు కూడా సేల్ చేయడానికిరెడీ అయ్యింది.
Akshayakalpa ready to sells organic vegetables and fruits
Akshayakalpa:సేంద్రియ పాల ఉత్పత్తుల సంస్థ అక్షయకల్ప (Akshayakalpa) హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. ఇందు కోసం భారీగా పెట్టుబడులు పెడుతుంది. ఇప్పటి వరకు సేంద్రియ పాలు మాత్రమే అమ్మిన సంస్థ.. ఇప్పుడు కూరగాయలు కూడా విక్రయించడానికి రెడీ అయ్యింది. ఆర్గానికి కూరగాయలు, పండ్లను అమ్మేందుకు ముందుకు వచ్చారు.
అక్షయకల్ప ఆర్గానిక్ కూరగాయలు, పళ్ల విభాగంలో ప్రవేశించింది. ‘గ్రీన్స్’ పేరుతో ఇవి మార్కెట్లో లభిస్తాయి. ఆర్గానిక్ గ్రీన్స్ ప్రారంభంతో తమ కంపెనీ ఆదాయాల్లో 15 శాతం వృద్ధిని ఆశిస్తున్నామని కంపెనీ సీఈఓ శశికుమార్ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో చెన్నై, హైదరాబాద్‌లో కూడా లభిస్తాయని వివరించారు. ఆ తర్వాత ముంబై, పూణె మార్కెట్లలో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
‘ బెంగళూరు కేంద్రంగా పనిచేసే కంపెనీ. ఇది వరకే తమిళనాడు, కర్ణాటకలో అగ్రికల్చర్ క్లస్టర్లను నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ సమీపంలో గల శంషాబాద్ దగ్గరలో మరో క్లస్టర్ డెవెలప్ చేస్తున్నాం. 300 మంది రైతులకు సేంద్రీయ వ్యవసాయం నేర్పించి, వారి ప్రొడక్టులను కొంటాం. గత ఏడాది రూ. 117 కోట్ల నిధులను సమీకరించాం. రూ. 205 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 300 కోట్లు దాటుతుందని భావిస్తున్నాం. కంపెనీకి బెంగళూరు, చెన్నై హైదరాబాద్‌లో 60 వేల మంది మంది కస్టమర్లు ఉన్నారు వచ్చే నెలలో చెంగల్పట్టులో కార్యకలాపాలను ప్రారంభిస్తాం. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో రూ.22 నుంచి 30 కోట్ల పెట్టుబడితో వచ్చే మూడేళ్లలో క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నాం” అని సీఈవో శశి కుమార్ తెలిపారు.