Pawan Kalyan: నోట్లో వేలు పెట్టినా కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు(Elections) జరుగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయాలు(politics) వేడెక్కాయి. తెలంగాణ(telangana)లో పక్కనపెట్టితే ఆంధ్రాలో ఈ సారి త్రిముఖ పోరు నడవనుంది.
Pawan Kalyan: రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు(Elections) జరుగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయాలు(politics) వేడెక్కాయి. తెలంగాణ(telangana)లో పక్కనపెట్టితే ఆంధ్రాలో ఈ సారి త్రిముఖ పోరు నడవనుంది. ప్రధానంగా వైసీపీ(YCP)ని మరో సారి అధికారంలోకి రానివ్వకుండా ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారపార్టీ చిన్న లోపాన్ని కూడా వదలకుండా ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకుంటున్నారు. ఒకరు కౌంటర్ వేస్తే మరొకరు దానికి ఎన్ కౌంటర్ ఇస్తున్నారు.
మరీ ముఖ్యంగా జనసేన, టీడీపీ, వైఎసార్సీపీ నాయకులు తగ్గేదేలే అన్నట్లు మధ్య మాటల యుద్దాలే చేస్తున్నారు. ఇక మంగళవారం నిజాంపట్నం(Nizampatnam)లో జనసేనానిపై సీఎం జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan) సెటైర్లు పేల్చారు. ట్విట్టర్ వేదికగా జగన్ కార్టూన్స్ ను షేర్ చేస్తూ పాపం పసివాడు అంటూ ఆట పట్టించడం మొదలుపెట్టారు. జగన్(YS jagan) చెప్పే మాటలను పాపం పసివాడు సినిమాగా తీయొచ్చని ఆ సినిమా పోస్టర్ ను షేర్ చేస్తూ పవన్ ట్వీట్ చేశారు. ” మన ఏపీ సీఎంతో ఎవరైనా పాపం పసివాడు సినిమా తీస్తారని నేను ఆశిస్తున్నాను. ఆయన చాలా అమాయకుడు.. అయితే ఇక్కడ ఓ చిన్న మార్పు అవసరం ఉంది.. ఆయన చేతిలో ఒక్క సూట్కేస్ బదులుగా.. అక్రమ సంపాదన కోసం మనీ లాండరింగ్ని ఈజీగా చేసే సూట్కేస్(Suitcase) కంపెనీలు ఉంచాలి” అని చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం జగన్ కార్టూన్ పోస్టర్ షేర్ చేస్తూ పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం పవన్ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
I hope someone makes this film with our AP CM. He’s too innocent & naive. Only a small change is needed here: instead of ‘suitcase’ in his hand , put multiple ‘suitcase companies’ which facilitated money laundering for his ill-gotten wealth. Dear AP CM , You are not Comrade… pic.twitter.com/9zOImRapAd