ప్రస్తుతం రష్మికపై కన్నడ ఇండస్ట్రీ మండిపడుతున్న సంగతి తెలిసిందే. సొంత ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతోందని.. ఛాన్స్ ఇచ్చిన సొంత బ్యానర్ పేరు చెప్పలేదని.. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ దెబ్బకు అమ్మడిని ఏకంగా కన్నడలో బ్యాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇంకా ఆ విషయంలో క్లారిటీ లేదు. అయితే దీని వల్ల రష్మికకు గట్టి దెబ్బే పడేలా ఉంది. ఇప్పటికే కన్నడ మేకర్స్ ఆమె తీరుకు అసహనంగా ఉన్నారు. వాళ్లే కాదు పాన్ ఇండియా సినిమా ప్లానింగ్‌లో ఉన్న దర్శక, నిర్మాతలు కూడా.. రష్మిక చేష్టలకు టెన్షన్ పడుతున్నారు. అయితే ఇప్పుడు సినిమా వాళ్లే కాదు.. కమర్షియల్‌గా కూడా రష్మికను పక్కకు పెట్టుస్తున్నారట. ఇప్పటికే పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తోంది రష్మిక. అయితే ఇప్పుడు రష్మిక చేస్తున్న పనికి.. తమ అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకునే ఆలోచనలో ఉన్నాయట కొన్ని కంపెనీలు. అందులోభాగంగా ఓ ప్రముఖ నగల సంస్థను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తోంది అమ్మడు. తాజాగా సదరు జ్యువెలరీ సంస్థ.. రష్మిక పై వస్తున్న నెగిటివిటీ వల్ల.. బ్రాండ్ అంబాసిడర్‌గా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఆమె ప్లేస్‌లో సీనియర్ బ్యూటీ త్రిషను తీసుకున్నట్టు టాక్. రష్మిక ఇలాగే ఆటిట్యూడ్ చూపిస్తే.. మున్ముందు మరిన్ని బ్రాండ్స్ ఆమె ఖాతాలోంచి ఎగిరిపోవడం ఖాయమంటున్నారు. అందుకే రష్మికకు.. ఇదంతా అవసరమా అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇకపోతే ప్రస్తుతం రష్మిక నటిస్తున్న చిత్రాల్లో.. వారసుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుండగా.. పుష్ప2 త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే బాలీవుడ్లో నటిస్తున్న యానిమల్ మూవీ సెట్స్ పై ఉంది.