యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్(Iswarya Menon) తమిళనాడులోని ఈరోడ్‌లో పుట్టి పెరిగింది. తమిళ కాదలిల్ సోదప్పువదు ఎప్పడి చిత్రంతో సినిమాల్లో ప్రవేశించింది. ఆ తర్వాత ఎమ్ ఎస్ రమేష్ దర్శకత్వం వహించిన దశావళ చిత్రంతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ. తన తదుపరి మలయాళంలో రొమాన్స్ చిత్రంలో, ఆ తర్వాత తెలుగులో లవ్ ఫేయిల్యూర్ మూవీలో యాక్ట్ చేసింది. తర్వాత పలు తమిళ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో స్పై చిత్రంలో హీరో నిఖిల్ సరసన యాక్ట్ చేస్తుంది. ఈ క్రమంలో తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని చిత్రాలను ఇప్పుడు చుద్దాం.