టాలీవుడ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ SPY ఈరోజు(జూన్ 29న) విడుదలైంది. ఈ చిత్రానికి బిహెచ్.గ్యారీ దర్శకత్వం చేయగా..ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. మరి ఈ మూవీ స్టోరీ ఎంటీ ? ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
చిత్రం: స్పై బ్యానర్: ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, ఈశ్వర్యా మీనన్, సన్యా ఠాకూర్, అభినవ్ గోమతం, ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్‌పాండే, జిషు సేన్‌గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ, కృష్ణ తేజ, ప్రిషా సింగ్, సోనియా నరేష్, తదితరులు దర్శకత్వం, ఎడిటింగ్: గ్యారీ BH కథ, నిర్మాత: కె రాజశేఖర్ రెడ్డి డీఓపీ : వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ సంగీత దర్శకులు : విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: శ్రీచరణ్ పాకాల విడుదల తేదీ: జూన్ 29, 2023
కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth). ఈరోజు(జూన్ 29న) నిఖిల్ యాక్ట్ చేసిన మరో పాన్ ఇండియా చిత్రం స్పై ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ ఒక యాక్షన్ థ్రిల్లర్ ఆని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీంతోపాటు ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్ సహా ట్రైలర్ కూడా ఈ చిత్రంపై ఆసక్తిని పెంచాయి. మరోవైపు స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ కాన్సెప్ట్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుందని, ట్రైలర్ చివరిలో రానా దగ్గుబాటి కనిపించడం కూడా సినిమాపై మరింత క్రేజ్ పెరిగేందుకు కారణమైంది. ఈ క్రమంలో ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ
ఇక కథలోకి వెళితే జై(నిఖిల్) అనే రా ఏజెంట్. శ్రీలంకలో పనిచేస్తాడు. అభినవ్ గోమతం అతని సహోద్యోగి. ప్రముఖ తీవ్రవాది ఖదీర్ ఖాన్‌ను మట్టుబెట్టే పనిలో భాగంగా జైని నియమిస్తారు. అయితే ఐదు సంవత్సరాల పాటు సాగిన మిషన్‌లో జై తన ఫ్యామిలీకి జరిగిన నష్టాన్ని తెలుసుకుంటాడు. ఆ క్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అనుసంధానించబడిన ఫైల్ కూడా కనిపించదు. అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫైల్ కు ఆ మిషన్ కు ఏంటి సంబంధం? ఆ సమస్యలను జై ఎలా చేధించాడు? చివరకు మిషన్ పూర్తైందా లేదా అతను ఖలీద్‌ను కనుగొని దాడిని ఆపారా లేదా అనేది అసలు స్టోరీ.
ఎలా ఉందంటే
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఖదీర్ భారత్ పై అణుదాడికి ప్లాన్ చేస్తాడు. RAW అతనిని పట్టుకోవడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. మిషన్ సమయంలో సుభాష్ చంద్రబోస్‌కి ఉన్న లింక్ సినిమా మొత్తం స్టోరీ తిరుగుతుంది. నిఖిల్ ఇక్కడ స్పై ఏజెంట్‌గా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. అతను తన పనిని నిజాయితీగా చేస్తాడు. దీంతోపాటు ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా పర్వాలేదు. కానీ టేకింగ్ రొటిన్ గా అనిపిస్తుంది. కొత్తగా ఏమి ఉండదు. హీరోయిన్ పాత్ర ఐశ్వర్యా మీనన్ సింపుల్‌గా ఎంట్రీ ప్లాన్ చేశాడు. అభినవ్ గోమతం, పృధ్వి నటించిన పలు కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఆ క్రమంలో రానా దగ్గుబాటి ఎంట్రీ ఇస్తాడు. రానా ఒక మిషన్‌లో నిఖిల్, ఈశ్వర్య, అభినవ్లకు సహాయం చేస్తాడు. ఆ నేపథ్యంలోనే నిఖిల్ చివరకి తన సోదరుడిని చంపిన వారిని కనిపెట్టేదిశగా క్లైమాక్స్ సాగుతోంది. ఈ చిత్రంలో ప్రధానంగా అధిక భాగం ఊహించే సీన్లు కనిపిస్తాయి. ఇక భావోద్వేగాలు ఈ చిత్రంలో అసలు పట్టించుకోలేదు.
సాంకేతిక విభాగాల తీరు
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. రెండు పాటలు బాగున్నాయి. సెకండాఫ్లోనిది సిట్యుయేషన్ కు తగ్గట్టుగానే ఇచ్చారు. కానీ ఎక్కువగా ఉపయోగపడినట్లు అనిపించదు. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కొన్ని లొకేషన్లు, బ్యాక్గ్రౌండ్లను బట్టి, ఇంకా బాగా చూపించవచ్చని అనిపిస్తుంది. దర్శకుడు గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ కూడా నిర్వహించారు. అయితే ఇక్కడ స్టోరీలో క్లారిటీతోపాటు డెప్త్ కూడా మిస్సయ్యింది. నార్మల్ గా కథ కొనసాగుతున్నట్లు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు
నిఖిల్ స్పై ఏజెంట్‌గా తన క్యారెక్టర్ మేరకు బెస్ట్ ఇచ్చాడు. దీంతోపాటు యాక్షన్ సీన్లలో కొత్తగా కనిపిస్తాడు. ఇక హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ కూడా బాగుంది. ఆమె అందంగా కనిపిస్తుంది. తన పరిమితి మేరకు యాక్ట్ చేసింది. మకరంద్ దేశ్‌పాండే కీలకమైన పాత్రను తనదైన స్టైల్లో పోషించారు. రానా దగ్గుబాటి అతిధి పాత్రలో అదరగొట్టారు. అభినవ్ గోమతం, పృధ్వి, ఆర్యన్ రాజేష్, తనికెళ్ల భరణి, జిస్సు సేన్‌గుప్తా, మకరంద్ దేశ్‌పాండే, సచిన్ ఖేడేకర్, సన్యా ఠాకూర్, పోసాని కృష్ణ మురళి, రవివర్మ సహా పలువురు వారి క్యారెక్టర్ల పరిధి మేరకు నటించారు.