TG: సీఎం రేవంత్ రెడ్డిని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న సాయంత్రం ముంబైలో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలి పెళ్లి వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ అయి.. కాసేపు ముచ్చటించారు.