»The First Cabinet Meeting Was Held In The New Secretariat Under The Chairmanship Of Cm Kcr
CM KCR : సీఎం కేసీఆర్ అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ
సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయంలో తొలిసారి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇటీవలే తెలంగాణ నూతన సచివాలయం (Secretariat) ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చాక ఇప్పటివరకు క్యాబినెట్ భేటీ జరగలేదు. ఈ నేపథ్యంలో, ఈ నెల 18న సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలి క్యాబినెట్ భేటీ (Cabinet meeting) నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, చివరిసారిగా తెలంగాణ (Telangana) క్యాబినెట్ భేటీ మార్చి నెలలో జరిగింది. సచివాలయం ప్రారంభించిన తర్వాత మంత్రులు పెద్దగా చాంబర్లలో కనిపించట్లేదు. ఒకరిద్దరు మినహా రోజూ సచివాలయంకు వచ్చిన పరిస్థితులు కూడా లేవు. దీంతో కేసీఆర్ గుర్రుగా ఉన్నారట. ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులతో మంత్రులు (Ministers) టచ్లో ఉంటూ సమీక్షలు నిర్వహించాలని సూచించబోతున్నారట. మంత్రులంతా మొక్కబడిగా కాకుండా ప్రతిరోజూ సచివాలయానికి రావాల్సిందేనని అని ఆదేశించే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. కొత్త సచివాలయంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..? అని కూడా గులాబీ బాస్ ఆరాతీసే చాన్స్ ఉంది.