పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై మరోసారి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పాక్ ఆర్మీ మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ నోమన్ సహా ఆరుగురు సైనికులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వెంటనే అప్రమత్తమైన పాక్ దళాలు ప్రతి దాడి చేశాయని.. ఈ ఘటనలో ఏడుగురు ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపారు.