ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్లో స్మృతి మంధాన అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 4 పరుగులు చేయడం ద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు చేసిన ఘనత సాధించింది. ఆసీస్‌పై మంధాన 21 ఇన్నింగ్స్‌లలో 6 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీల సహాయంతో ఈ మైలురాయిని చేరుకుంది. గతంలో ఇంగ్లండ్‌పై కూడా ఆమె 1000 పరుగుల మార్క్‌ను అందుకుంది.