SRPT: నవంబర్ 1న హైదరాబాద్లో నిర్వహించనున్న దళితుల ఆత్మగౌరవ మహా ర్యాలీకి దళిత విద్యార్థులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎంఈఎఫ్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ పందింటి నవీన్ మాదిగ పిలుపునిచ్చారు. గురువారం కోదాడలో జరిగిన విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గవాయిపై జరిగిన దాడి దేశంలోని దళితులందరిపై జరిగిన దాడిగా అభివర్ణించారు.