VZM: గుర్ల కస్తూరిబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డా. ఏ.కృష్ణ ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ ఘాతానికి గురైన గదిని పరిశీలించి, విద్యుత్ శాఖ ఏఈ నుండి షార్ట్ సర్క్యూట్ వివరాలు తెలుసుకున్నారు. నివేదిక సమర్పించాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం వద్దన్నారు.