WNP: దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ‘గరీబీ హఠావో’ అని నినదించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తి నేటికీ అవసరమని ఏఐపీసీ రాష్ట్ర అధ్యక్షుడు డా.జిల్లెల్ల ఆదిత్య రెడ్డి అన్నారు. వనపర్తికి చెందిన ఆయన గాంధీభవన్లో సర్దార్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. చైనా, పాకిస్థాన్ యుద్ధాలలో ఆమె చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయమని కొనియాడారు.