E.G: మొంథా తుఫాన్ ధాటికి ఎక్కువ శాతం కెమికల్ పంటలు నేలమట్టం కాగా, సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వరి మాత్రం తట్టుకుంది. రైతు జాజుల సూర్యకుమారి తన పొలంలో సేంద్రియ ఎరువులతో, ‘వన్ ఇన్ టు వన్’ పద్ధతిలో సాగు చేసిన పంట తుఫాన్ ప్రభావం లేకుండా నిలకడగా ఉందని తెలిపారు. పక్కనే కెమికల్ ఎరువులతో సాగు చేసిన వరి నేలపాలైందని పేర్కొన్నారు.