కృష్ణా: ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సేవలను స్మరించుకున్నారు. కులమత వర్గ లింగ భేదాలు లేకుండా ప్రజలందరూ ఐకమత్యంతో మెలిగి దేశ సమైక్యత, అంతర్గత భద్రత కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.