ATP: శింగనమల అభివృద్ధిని చూడలేక వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. మట్టి మాఫియాను తానే మొదట ప్రశ్నించానని, కేసు కూడా నమోదైందని తెలిపారు. తన తల్లిని ఈ వివాదంలోకి లాగడాన్ని ఖండించారు. మహిళల గౌరవాన్ని తగ్గించే కుట్రలను మానుకోవాలని అన్నారు. నిరాధార ఆరోపణలకు శిక్ష తప్పదని హెచ్చరించారు.