SRCL: మొంథా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొంథా తుఫాన్ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.