చైనాకు చెందిన మానవ సహిత అంతరిక్ష కేంద్రం ప్రతినిధి జింగ్బో కీలక ప్రకటన చేశారు. 2030 నాటికి చంద్రుడిపై తమ వ్యోమగామిని దింపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రగామిగా ఉండాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికతో ఉన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వ్యోమగాముల బృందాన్ని త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.