MDK: పౌల్ట్రీ ఫామ్ వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రాగుల మోహన్ అనే రైతు గురువారం తన పౌల్ట్రీ ఫాం వద్ద విద్యుత్తు సరఫరా లేకపోవడంతో తీగలు సరిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి మృతి చెందారు.