NGKL: పట్టణ సమీపంలోని నాగనూలు శివారులోని నాగసముద్రం వాగులో నిన్న గల్లంతైన అంబటిపల్లికి చెందిన కరుణాకర్ మృతిచెందాడు. నాగనూల్ నుంచి నడుచుకుంటూ వస్తుండగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు ప్రవాహంలో ఆయన గల్లంతయ్యారు. ఈ ఘటనలో మరో వ్యక్తి శ్రీనివాసులు సురక్షితంగా బయటపడ్డారు. కరుణాకర్ ఆచూకీ కోసం పోలీసులు,రెస్క్యూ సిబ్బంది గాలింపులో మృతదేహం లభ్యమైంది.