KNR: శంకరపట్నం మండలంలోని ఎర్రడపల్లి గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తహశీల్దార్ కె. సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, రాజకీయ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, దళిత నాయకులు పాల్గొనాలని ఆమె కోరారు. పౌర హక్కుల పరిరక్షణలో అందరూ చురుకుగా భాగస్వామ్యం కావాలని సూచించారు.