అన్నమయ్య: జిల్లాలోని రాయచోటిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాదాపు 180 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.