WGL: తీవ్ర వర్షాల కారణంగా మండలంలోని కొంకపాక, గోపనపల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరువైపులా ఉన్నలో లెవెల్ కల్వర్టులపై వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి రాకపోకలను నిలిపివేశారు. కల్వర్టుల స్థానంలో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని పలుమార్లు కథనాలు వచ్చినా చర్యలు లేక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.