ప్రకాశం: జిల్లాలోని వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇవాళ కూడా అన్ని పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ఇప్పటికే తుఫాన్ నేపథ్యంలో మూడు రోజులపాటు సెలవు ప్రకటించగా తాజాగా మరొక రోజును పొడిగించినట్లు, ఈ విషయాన్ని జిల్లాలోని విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు ఇంటికే పరిమితం కావాలని సూచించారు