HYD: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లకు తెలంగాణ కేబినెట్లో హైదరాబాదీకి చోటు దక్కింది. బుధవారం అధిష్ఠానం నుంచి అనూహ్యంగా అజహరుద్దీన్ పేరు ఖరారు చేయడం విశేషం. జూబ్లీహిల్స్ టికెట్ త్యాగం చేసిన ఆయన పార్టీకి విధేయుడిగానే వ్యవహరించారు. జూబ్లీ బైపోల్ ముంగిటే మంత్రి పదవి వరించడంతో అజ్జా భాయ్ అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.