SRPT: జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట జిల్లాకు నేడు సెలవు ప్రకటించింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి ఈ ప్రకటన విడుదల చేసింది. మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున, విద్యార్థుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.