BDK: పినపాక ఈ బయ్యారం ZPHSలో నవంబర్ 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్న నేషనల్ గేమ్స్ స్టేట్ మీట్ ఆటల పోటీల ఏర్పాట్లను MLA పాయం వెంకటేశ్వర్లు బుధవారం సమీక్షించారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను ఈ బయ్యారంలో నిర్వహించడం గర్వకారణమని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు MLA సూచించారు.