GNTR: మొంథా తుఫాన్ నేపథ్యంలో తాడికొండ మండలం లాం వద్ద వాగులో పెరిగిన వరద ఉధృతిపై బుధవారం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ స్పందించారు. స్వయంగా లామ్ ప్రాంతానికి వెళ్లి పరిస్తితినీ పరిశీలించారు.రాకపోకలకు ఆటంకం కలుగుతున్నందున, గ్రామస్థులు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.