ATP: ప్రభుత్వ ఆసుపత్రిని MLA దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీలు, వార్డులు పరిశీలించి, రోగుల నుంచి వైద్య సేవలపై ఆరా తీశారు. 15 విభాగాల్లో వైద్యులు సమయపాలన పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రిని 1200 పడకల ఆసుపత్రిగా మారుస్తామని, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని అన్నారు.