ఇటీవల చంద్రబాబు… ఇవే చివరి ఎన్నికలు అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పట్టుకొని… అధికార పార్టీ నేతలు ఎక్కువగానే విమర్శలు చేశారు. అందుకే… ఆ మాటలకు తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు కాదని…. రాష్ట్రానికి ఇది చివరి అవకాశం అని ఆయన పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు… ఈ రోజు దెందులూరు పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం సీఎం జగన్ కి చెంప దెబ్బలాంటిదని ఆయన అన్నారు. వైఎస్ వివేకాను ఎవరు చంపారు..? ఎందుకు చంపారు? అనే విషయాలు వెలుగులోకి రావాలన్నారు. ఈ విషయం పై జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే… అమరావతి రాజధానిగా ఉండదని, పోలవరం ముంచేస్తాడని ఆ నాడే ప్రజలకు వివరించానని చెప్పారు. ముద్దులు పెడుతున్నాడని… మోసపోవద్దని.. గెలిచిన తర్వాత పిడిగుద్దులుంటాయని స్పష్టంగా చెప్పానని.. ఆనాడు నేను చెప్పిందే ఈ రోజు జరుగుతోందని చంద్రబాబు చెప్పారు.
ఇక మరోసారి ఉన్మాదుల గెలిస్తే అమరావతి, పోలవరం ఉండదన్న ఆయన నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు.. ఇపుడు ప్రజలు కళ్ళు తెరవాలి.. లేదంటే రాష్ట్రానికి ఇదే చివరి అవకాశం.. నాకు కాదని అన్నారు. కేంద్రాన్ని మెప్పించి పోలవరం కి అన్ని అనుమతులు తీసుకు వచ్చామని, అసలు కొత్తగా వచ్చిన మంత్రికి డయా ఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంటుందో తెలీదని ఎద్దేవా చేశారు.
టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశాం.. జగన్ సీఎం అయ్యాక రివర్స్ టెండర్ అని పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని, పోలవరం నదిలో ముంచేసి నేనే చేశా అంటున్నారు, పోలవరం పూర్తి చేయలేకపోవడం రాష్ట్రానికి ఇదేం కర్మ అంటూ బాబు ప్రశ్నించారు. వాళ్ళు తలచుకుంటే బాబాయి ని చంపినట్టు నన్ను చంపేస్తా అంటున్నారట.. వాళ్ల టార్గెట్ ఇప్పుడు లోకేష్ కూడా అని జగన్ కి పోలీసులు వుంటే నాకు ప్రజల మద్దతు ఉంది అని ఆయన అన్నారు.