W.G: జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు బుధవారం వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 570.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జిల్లాలో అత్యధిక వర్షపాతం ఎలమంచిలి మండలంలో 53.8 మిల్లీమీటర్లు నమోదయింది. అలాగే జిల్లాలో అత్యల్ప వర్షపాతం గణపవరం మండలంలో 13.6 మిల్లీమీటర్లుగా వర్షపాతం నమోదైంది.