HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్షంలోనూ ప్రచారం నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలో సుమారు 300 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లోకి చేరారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు.