కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఆరేకల్ రామకృష్ణ మంగళవారం హౌసింగ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై, అలాగే 2014–2019 మధ్య పెండింగ్లో ఉన్న హౌసింగ్ బిల్లుల గూర్చి చర్చించారు.