NDL: ముఖ్యమంత్రి చంద్రబాబును ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం కలిశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వర్షాలకు నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని దొర్నిపాడు మండలంలో ఉద్యోగాల పేరిట డబ్బులు కట్టి మోసపోయిన ప్రజలను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. తుఫాను తగ్గిన వెంటనే మార్క్ ఫేడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.