»A Wife Decision Boring With Her Husband Search A Boy Friend For Online
Wife: భర్త బోర్ కొట్టడంతో.. ప్రియుడిని వెతుకున్న భార్య!
ఓ మహిళ(woman) తన భర్తతో లైఫ్ బోరింగ్ గా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగలేదు. ఇక ఆన్ లైన్లో తనకు తగిన లవర్(lover) కోసం వెతకగా ఓ వ్యక్తి తగిలాడు. అంతేకాదు తన బాయ్ ఫ్రెండ్ తన ఖర్చుల కోసం నెలకు 60 వేల రూపాయలు కూడా ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ మహిళ వయసు 42 ఏళ్లు కాగా..ఇది తెలిసిన పలువురు మద్దతు చెబుతుండగా..మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు.
తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు వంటి అనేక రక్త సంబంధాలు జీవితంలో చాలా ప్రత్యేకమైనవి. అయితే వీటన్నింటి కంటే ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అదే భార్యాభర్తల(wife and husband) అనుబంధం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అందమైన బంధానికి నమ్మకం, ప్రేమ అవసరం. ఎందుకంటే భార్యాభర్తల బంధం చాలా సున్నితమైనది. ఒక్కసారి దారం తెగితే..మళ్లీ అతికించడం చాలా కష్టమనే చెప్పవచ్చు. అదే విధంగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే.. అవి వారి జీవితంపై ప్రభావం చూపుతాయి. ఆ క్రమంలో సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారి తీస్తాయి. కానీ దంపతులు కలత చెందకుండా.. జీవితాన్ని కొనసాగించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం భార్యాభర్తల మధ్య సంబంధాలను పెద్దగా పట్టించుకోరు. అంతేకాదు పెళ్లయిన తర్వాత కూడా ఇతరులతో సంబంధాలు కలిగి ఉంటారు. అలాంటి ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భర్తపై నమ్మకం, ప్రేమ తగ్గుముఖం పట్టిందని తెలిపింది. దీంతో జెన్నీకి కొత్త ఆలోచన వచ్చింది.. వెంటనే.. ఇల్లిసిట్ ఎన్ కౌంటర్స్ అనే వెబ్ సైట్(website) లో ఐడీని క్రియేట్ చేసి ప్రియుడి కోసం వెతకడం మొదలుపెట్టింది. 42 ఏళ్ల మహిళకు పెళ్లయినా మరో వ్యక్తితో సంబంధం ఏర్పడింది. అంతేకాదు తన బాయ్‌ఫ్రెండ్ నుంచి పాకెట్ మనీ కోసం ప్రతి నెలా దాదాపు 60 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ మహిళ నెట్లో హల్చల్ చేస్తోంది. ఆ మహిళ పేరు జెన్నిఫర్.
ఇటీవల జెన్నిఫర్ తన జీవితం గురించి షాకింగ్ నిజం చెప్పింది. భర్త(husband)తో లైఫ్ బోరింగ్ అని తెలిపింది. అంతేకాదు ఖర్చు చేయడానికి కూడా అతని వద్ద సరిపడా డబ్బు లేదని వాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తన భర్తపై నమ్మకం సన్నగిల్లిందని చెప్పింది. దీంతో కొత్త విషయం ఆలోచించిన జెన్నీ.. వెంటనే.. ఓ వెబ్సైట్లో ఇల్లిసిట్ ఎన్కౌంటర్స్ అనే ఐడీని క్రియేట్ చేసి ప్రియుడి కోసం వెతకడం మొదలుపెట్టింది.
ఎట్టకేలకు జెన్నీ తపన ఫలించింది. ప్రియుడిని ఎంచుకుంది. అయితే ఈ ప్రియుడి(lover) గురించి జెన్నీ తన భర్తకు మాత్రం చెప్పలేదు. తన బాయ్‌ఫ్రెండ్ నుంచి ఖర్చుల కోసం డబ్బు తీసుకోవాలనుకోలేదని, తన బాయ్‌ఫ్రెండ్ డబ్బు ఇస్తున్నాడనే విషయాన్ని కాదనలేనని జెన్నిఫర్ చెప్పింది. ఇప్పుడు జెన్నీ ప్రియుడు ఆమెకు ప్రతి నెలా స్థానిక కరెన్సీలో దాదాపు 60 వేల రూపాయలు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఆ డబ్బుతో జెన్నీ షాపింగ్‌కి వెళ్తుంది. తన కోరికలన్నీ నెరవేర్చుకుంటుంది. అయితే ఈ విషయం తన భర్తకు తెలిస్తే భార్యాభర్తల మధ్య బంధం ప్రమాదంలో పడుతుందనే భయం కూడా ఒకవైపు జెన్నీకి ఉందని చెప్పుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి లవ్ పై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.