»Bjp Mp Gvl Narasimha Rao Comments Alliance In Ap Elections
BJP MP GVL:జనసేన-బీజేపీ పొత్తు ఖాయం.. టీడీపీ కూడా వస్తోందట:జీవీఎల్
వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టంచేశారు. టీడీపీ కూడా కలిసి వస్తోందని పవన్ కల్యాణ్ తమతో చెప్పారని.. ఈ విషయం కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
BJP MP GVL Narasimha Rao Comments Alliance In AP Elections
BJP MP GVL Narasimha Rao:ఏపీలో పొత్తు రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. జనసేన-బీజేపీ పోటీ అని.. జనసేన-టీడీపీ బరిలోకి దిగుతాయని ఇదివరకు రూమర్స్ వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు తథ్యం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) అంటున్నారు. బీజేపీ-జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెబుతున్నారు. అందుకోసం చర్చలు జరుగుతున్నాయని ఇండికేషన్స్ ఇచ్చారు. దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు (GVL Narasimha Rao) స్పందించారు.
ప్రస్తుతానికి అయితే జనసేనతో తమ పార్టీ పొత్తు ఉంటుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు (GVL Narasimha Rao) అన్నారు. టీడీపీ కూడా కలిసి వస్తోందనే ప్రతిపాదన తీసుకొచ్చారని వివరించారు. ఈ విషయాన్ని తాము హై కమాండ్‌కు తెలియజేశామని తెలిపారు. ఏపీలో పొత్తులకు సంబంధించి కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పొత్తుల గురించి రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోబోదని స్పష్టంచేశారు. జీవీఎల్ (GVL)కామెంట్స్‌తో పవన్ కల్యాణ్ డిఫెన్స్‌లో పడ్డట్టు ఉంటారు. ఎందుకంటే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదించే వరకు టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉండదు.
అంతకుముందు మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ (pawan kalyan).. మీడియా ఎదురుగా కూర్చొని కాదు.. ప్రజల మధ్య పొత్తులపై ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని తేల్చిచెప్పారు. త్రిముఖ పోటీ ఉండకూడదని.. అలా అయితే మరోసారి బలి అవుతామని వివరించారు. ఇప్పుడు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యం అని.. విజయం సాధించిన తర్వాత సీఎం ఎవరు కావాలనే అంశం గురించి చుద్దాం అని చెప్పారు. తమ ప్రాథమిక లక్ష్యం వైసీపీ, సీఎం జగన్ (jagan) అని కుండబద్దలు కొట్టారు.
చదవండి: Pawan Kalyanకు మంత్రి అంబటి రాంబాబు లేఖ
తనకు ఏ పార్టీ మీద ప్రేమ లేదు ద్వేషం లేదని పవన్ కల్యాణ్ (pawan kalyan) అన్నారు. వైసీపీ మీద కూడా ద్వేషం లేదన్నారు. జనాలకు మంచి చేయడం లేదనే కోపం మాత్రం ఉందన్నారు. కక్షసాధింపు చర్యలకు దిగుతుందని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, ఫ్యుడలిస్టిక్ ఆలోచన విధానం తీసుకొచ్చారని వివరించారు. రాయలసీమలో చెట్లు కొట్టే సంస్కృతి ఉందని.. దానిని పచ్చని గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చారని గుర్తుచేశారు. రోడ్లు వేయని వ్యక్తి.. రైతులకు న్యాయం చేయని వ్యక్తి అని సీఎం జగన్‌పై పవన్ కల్యాణ్ (pawan kalyan) ఫైరయ్యారు.